స్పామ్​ కాల్స్​కు  పర్మిషన్​ తప్పనిసరి చేయాలె

స్పామ్​ కాల్స్​కు  పర్మిషన్​ తప్పనిసరి చేయాలె

 

  • స్పామ్​ కాల్స్​కు  పర్మిషన్​ తప్పనిసరి చేయాలె
  • యూనిఫైడ్​  డిజిటల్​ ప్లాట్​ఫామ్​ తేవాలె
  • టెల్కోలకు సూచించిన ట్రాయ్​

న్యూఢిల్లీ: కస్టమర్లను విసుగెత్తించే ప్రమోషనల్​, స్పామ్​ కాల్స్​కు, మెసేజ్​లను అడ్డుకట్టవేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) టెల్కోలను ఆదేశించింది. కస్టమర్​ అనుమతి ఉంటేనే ఇట్లాంటి కాల్స్ ​ వచ్చేలా చేయాలని, ఇందుకోసం యూనిఫైడ్​ డిజిటల్​ ప్లాట్​ఫామ్ ‘డిజిటల్​ కన్సెంట్​ అక్విజిషన్​’ (డీసీఏ)​ తీసుకురావాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రెండు నెలల గడువు ఇచ్చింది. మొదటి దశలో కాల్స్​కు అనుమతి ఇస్తూ సబ్​స్క్రయిబర్లు మాత్రమే రిజిస్టర్​ చేసుకుంటారు. రెండో దశలో ఇదే పనిని బిజినెస్​ సంస్థలు చేయాల్సి ఉంటుంది. కాల్స్​ చేయడానికి పర్మిషన్​ ఇవ్వాలని కస్టమర్​ను ఇవి కోరాల్సి ఉంటుందని ట్రాయ్​ తెలిపింది. 

ప్రమోషనల్​ మెసేజ్​లు పంపాలంటూ కస్టమర్​ పర్మిషన్​ ఇచ్చే విధానం ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. డిజిటల్​ కన్సెంట్​ అక్విజిషన్ విధానాన్ని ఇప్పటికిప్పుడు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టే రెండు నెలల సమయం ఇచ్చామని, టెలికం కమర్షియల్​ కమ్యూనికేషన్​ కస్టమర్​ ప్రిఫరెన్స్ ​రెగ్యులేషన్స్​ 2018 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశామని సంస్థ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కొత్త విధానం ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, వ్యాపార సంస్థలు, ట్రేడింగ్​ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు వంటివి ఇక నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే కస్టమర్​కు కాల్స్​ చేయాలి.  

యూనిఫైడ్​ డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ లేకపోవడం వల్ల టెలికాం ఆపరేటర్లు స్పామ్​కాల్స్​ను అడ్డుకోలేకపోతున్నారని ట్రాయ్​  వర్గాలు తెలిపాయి. కస్టమర్​ అనుమతి వివరాలను డిజిటల్ లెడ్జర్​  ప్లాట్​ఫారమ్​లోకి పంపిస్తారు. ఈ డేటా టెల్కో ఆపరేటర్లందరికీ అందుబాటులో ఉంటుంది. అనుమతి మెసేజ్​లు పంపడానికి ‘127’తో మొదలయ్యే కోడ్​ను ఉపయోగించాలని రిలయన్స్​ జియో, ఎయిర్​టెల్​, వీఐలను కోరింది. అనుమతి కోరేటప్పుడే ఏ సంస్థ కాల్​ చేయాలనుకుంటుందనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలి. అనుమతి పొందిన వెబ్​సైట్లు, యాప్​ లింక్స్​, ​నంబర్లు మాత్రమే కస్టమర్​ను సంప్రదించగలుగుతాయి.