క్వారంటైన్‌ బ్రేక్‌ చేసినందుకు.. జైలు శిక్ష

క్వారంటైన్‌ బ్రేక్‌ చేసినందుకు.. జైలు శిక్ష
  • ఆస్ట్రేలియాలో వ్యక్తి నెల రోజులు శిక్ష

సిడ్నీ: గర్ల్‌ ఫ్రెండ్‌ను కలిసేందుకు క్వారంటైన్‌ను బ్రేక్ చేసి సెంటర్‌‌ నుంచి పారిపోయిన జోనాథన్‌ అనే వ్యక్తికి ఆస్ట్రేలియాలోని పెర్త్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు నెల రోజులు జైలు శిక్ష విధించింది. లాక్‌డౌన్‌ చట్టాల ప్రకారం శిక్ష పడిన మొదటి వ్యక్తి జోనాథన్‌ అని అధికారులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 28న విక్టోరియా నుంచి వచ్చిన జోనాథన్‌ను రూల్స్‌ ప్రకారం అధికారులు పెర్త్‌ హోటల్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారు. అయితే గార్ల్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వీలు కుదరకపోవడంతో అతడు హోటల్‌లోని ఫైర్‌‌ ఎగ్జిట్‌ ద్వారా తప్పించుకుని పారిపోయాడు. ఈ విషయాన్ని సీసీటీవీలో కనిపెట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు నెల రోజులు జైలు శిక్ష విధించింది. అతని క్వారంటైన్‌ సోమవారానికి పూర్తి అవ్వాల్సిఉందని, ఇప్పుడు నెల రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని, దాంతో పాటు ఫైన్‌ కూడా కట్టాల్సి వచ్చిందని పోలీసు అధికారి అన్నారు.