పేదరికాన్ని స్వయంగా అనుభవించా: మోడీ

పేదరికాన్ని స్వయంగా అనుభవించా: మోడీ

రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని తెలిపారు ప్రధాని మోడీ. తాను పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదని, దాన్ని స్వయంగా అనుభవించానన్నారు. ఒకప్పుడు తాను రైల్వే ప్లాట్ ఫాంపై టీ అమ్ముకున్నానని… ఇప్పుడు ఇక్కడి వరకూ వచ్చానని చెప్పారు. గౌరవంగా బతికానని, తనకు పేదలంటే గౌరవమని  తెలిపారు. వారికి సాధికారత లభించినప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని చెప్పారు. భారత్ లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు ప్రతి ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తున్నామన్నారు. వీటి ద్వారా వారికి గౌరవం లభిస్తుందని చెప్పారు మోడీ.