- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నా రెడ్డి
వనపర్తి, వెలుగు: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సూచించారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. బుధవారం ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో జిల్లాలోని 728 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ హాజరయ్యారు. 21న దివ్యాంగుల ప్రజావాణి నిర్వహించనున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 20 మంది మైనార్టీలకు రూ.30 వేల చొప్పున చెక్కులను అందజేశారు.
ప్రాజెక్టులపై సబ్జెక్టు ఉంటే ఎందుకు పారిపోయారు?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కు ప్రాజెక్టులపై సబ్జెక్టు ఉంటే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకుపోతున్నా కేసీఆర్ ప్రశ్నించలేదని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల నీటిని మెదక్ వరకే పరిమితం చేశారన్నారు. పాలమూరుకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
