
ఓ ఇద్దరు యువకులు ఓ కుక్కకు తాడు కట్టి చెరువులోకి విసిరేస్తారు. దీంతో తన ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ కుక్క ప్రయత్నం చేయగా గట్టున ఉన్న ఆ ఆకతాయిలు రాళ్లతో కుక్కని కొట్టారు. ఆ కుక్క ప్రాణాల్ని విడిచినట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువకుల్ని పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించింది. వారి వివరాలు తెలిసిన వాళ్ళు ’91 9820122602′ మొబైల్ నంబర్ కు లేదంటే e-mail Info@petaindia.org లకు నేరుగా సమాచారం ఇవ్వాలని కోరింది. ఆ ఆకతాయిల గురించి సమాచారం అందించిన వ్యక్తులకు ఎటువంటి హాని జరగకుండా వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.
#tiktokbanindia
Got this Video via whatsapp , Please Ban tiktok . pic.twitter.com/j8uYP13FKE— Tarun choubey (@Tarunchoubey4) May 20, 2020