త్వరలో టెన్నిస్‌‌‌‌కు క్విటోవా గుడ్‌‌‌‌బై

త్వరలో టెన్నిస్‌‌‌‌కు క్విటోవా గుడ్‌‌‌‌బై

లండన్‌‌‌‌: చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌, రెండుసార్లు వింబుల్డన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ పెట్రా క్విటోవా సెప్టెంబర్‌‌‌‌లో టెన్నిస్‌‌‌‌కు వీడ్కోలు పలకనుంది. ఈ మేరకు సోషల్‌‌‌‌ మీడియాలో ఒక ప్రకటన చేసింది. వింబుల్డన్‌‌‌‌ కోసం వైల్డ్‌‌‌‌ కార్డు మంజూరు చేసిన తర్వాతి రోజునే తన రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటన చేయడం గమనార్హం. ‘చివరిసారి వింబుల్డన్‌‌‌‌లో ఆడటానికి నేను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఇక్కడ ఆడటాన్ని చాలా ఆస్వాదిస్తా. నా కెరీర్‌‌‌‌లో అత్యంత ప్రియమైన జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. యూఎస్‌‌‌‌లో నా హార్డ్‌‌‌‌ కోర్టు స్వింగ్ ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలియదు. అయితే యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ తర్వాత నా క్రీడా కెరీర్‌‌‌‌ను ముగించాలని భావిస్తున్నా’ అని క్విటోవా పేర్కొంది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌కు చేరుకున్న క్విటోవా.. ఫెడ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఆరుసార్లు ట్రోఫీలు నెగ్గింది.