జీఎస్టీ పరిధిలోకి పెట్రో ప్రొడక్టులు?

జీఎస్టీ పరిధిలోకి పెట్రో ప్రొడక్టులు?

న్యూఢిల్లీ:పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌పై జీఎస్టీ విధించే ప్రపోజల్‌‌‌‌ను కేంద్రమంత్రుల ప్యానెల్‌‌‌‌   పరిశీలించబోతోందని తెలుస్తోంది. దీనివల్ల ఈ ప్రొడక్టుల ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. చుక్కల్లో ఉన్న పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరలకు కళ్లెం వేయాలంటే వీటిని కూడా జీఎస్టీ విధానంలోకి తీసుకురావాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. జీఎస్టీ అమలు చేస్తే తమ రెవెన్యూ పడిపోతుందని అంటున్నాయి. అయితే సెంట్రల్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ నిర్మలా సీతారామన్‌‌‌‌ నాయకత్వంలోని ప్యానెల్‌‌‌‌ శుక్రవారం ఈ విషయంపై చర్చలు జరుపుతుందని ఈ సంగతి తెలిసిన కొందరు ఆఫీసర్లు మీడియాకు వెల్లడించారు. ఇతర పెట్రోలియం ప్రొడక్టులనూ జీఎస్టీకి కిందకు తెచ్చే విషయంపైనా చర్చలు ఉంటాయని అన్నారు. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రపోజల్‌‌‌‌ను పరిశీలించాలని ఇటీవల కేరళ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మినిస్టర్ల ప్యానెల్‌‌‌‌ సమావేశం గురించి అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఫైనాన్‌‌‌‌ మినిస్ట్రీ ప్రతినిధి ఇష్టపడలేదు. ప్యానెల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ యూపీ రాజధాని లక్నోలో జరుగుతుంది. 
అంత ఈజీ కాదంటున్న ఎక్స్​పర్టులు
మనదేశంలో జీఎస్టీ 2017 జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌, ఏవియేషన్ టర్బైన్‌‌‌‌ ఫ్యూయల్‌‌‌‌, నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌, క్రూడాయిల్‌‌‌‌ మినహా మిగతా అన్ని వస్తువులను ఈ కొత్త పన్ను విధానంలోకి తెచ్చారు. అయితే పెట్రోలియం ప్రొడక్టులను జీఎస్టీ కిందకు తేవడం అంత ఈజీ కాదని ట్యాక్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్టులు చెబుతున్నారు. కేవలం నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ను జీఎస్టీకి కిందకు తెచ్చినా గుజరాత్‌‌‌‌ వంటి రాష్ట్రాలకు విపరీతంగా నష్టం వస్తుందని అంటున్నారు. జీఎస్టీ ద్వారా వచ్చిన డబ్బును కేంద్ర, రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి.  పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌పై రూ.32 చొప్పున కేంద్రం పన్ను వేస్తోంది. ఈ డబ్బు  కేంద్రం ఖాతాలోకే వెళ్తుంది. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. జీఎస్టీ అయితే రాష్ట్రాలకూ వాటా ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగే సమావేశంలో పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరలతోపాటు కరోనా ట్రీట్‌‌‌‌మెంటు కోసం వాడే డ్రగ్స్‌‌‌‌కు ఈ ఏడాది డిసెంబరు దాకా రాయితీలు ఇచ్చే ప్రపోజల్‌‌‌‌ను కూడా మినిస్టర్స్‌‌‌‌ ప్యానెల్‌‌‌‌ పరిశీలిస్తుంది.  

అనుమతి తప్పనిసరి...
జీఎస్టీ విధానంలో మార్పులు తేవాలంటే ప్యానెల్‌‌‌‌లో నాలుగింట మూడొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు, ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌పై జీఎస్టీ వసూలు చేసే ప్రపోజల్‌‌‌‌ను గతంలోనే చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇదే జరిగితే తాము పెద్ద మొత్తంలో రెవెన్యూను కోల్పోవాల్సి ఉంటుందని అన్నాయి. పెట్రో ప్రొడక్టులపై పన్నులు వసూలు చేసే అధికారాన్ని వదులుకోవడం ఎంతమాత్రమూ ఇష్టం లేదని స్పష్టం చేశాయి. కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూలో అత్యధిక వాటా వీటి నుంచి రావడమే ఇందుకు కారణం. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ రిటైల్‌‌‌‌ ధరల్లో దాదాపు 60 శాతం వరకు పన్నులే ఉంటున్నాయి. అందుకే ఈ రెండింటి ధరలు రూ.వంద దాటాయి. దీంతో ఇతర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి ఆర్‌‌‌‌బీఐ వడ్డీరేట్లను పెంచలేకపోతోంది. ఫలితంగా తక్కువ ధరలకు అప్పులు పుడుతున్నాయి.  మనదేశంలో వాడుతున్న గ్యాసోలిన్‌‌‌‌ ప్రొడక్టుల్లో సగం వాటా పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌దే ఉంటుంది.