17వ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

17వ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

జూన్ 7 నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రతిరోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఆయిల్ ధరలను కంపెనీలు రోజువారీగా మార్చడం వల్ల ప్రజలు తెలియకుండానే పెరిగిన ధరలను భరిస్తూ వస్తున్నారు. నేటితో వరుసగా 17వ రోజు కూడా దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 20 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత 17 రోజుల నుంచి పెట్రోల్ పై మొత్తంగా రూ. 8.50పైసలు, డీజిల్ పై రూ. 10.01పైసలు పెరిగింది. నేడు పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 79.76 పైసలు మరియు డీజిల్ ధర రూ. 79.40 పైసలకు చేరింది.

కొత్త రేట్ల ప్రకారం వివిధ నగరాలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 81.45, డీజిల్‌ 74.63, చెన్నైలో పెట్రోల్‌ రూ.83.04, డీజిల్‌ రూ. 76.77, బెంగుళూర్‌లో పెట్రోల్‌ రూ. 82.35, డీజిల్‌ రూ. 75.51, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 82.79, డీజిల్‌ రూ. 77.60, ముంబైలో పెట్రోల్‌ రూ. 86.54, డీజిల్‌ రూ. 77.76 పైసలకు చేరుకుంది.

For More News..

హెచ్‌1-బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం

షెల్టర్ హోంలో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు మైనర్లకు ప్రెగ్నెన్సీ

కిరాణా కొట్టు బాకీలు వసూల్ చేసిన వ్యక్తే.. స్టేట్ బ్యాంక్ రికవరీ హెడ్