మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు ఆగడం లేదు. అక్టోబర్ 1న పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 30 పైసల చొప్పున రేటు పెంచినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.106కు చేరింది. ఇక డీజిల్ లీటరు రూ.98.08కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కు, డీజిల్ రేటు రూ.90.17కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ రేటు రూ.107.95, డీజిల్ ధర రూ.97.84గా ఉన్నాయి.

తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రేటు రూ.99.58, డీజిల్ ధర రూ.94.74కు పెరిగాయి. తాజా పెరుగుదలతో కర్ణాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ రూ.105.44, డీజిల్ రూ.95.70గా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పెట్రోల్ రేటు రూ.102.47, డీజిల్ ధర రూ.93.27కు చేరాయి. 

గత నెలలో దాదాపు 21 రోజుల పాటు స్థిరంగా ఆయిల్ రేట్లు ఇటీవల వరుసగా పెట్రోల్ మూడోసారి, డీజిల్ ఆరోసారి ధరలు పెరిగాయి. సెప్టెంబర్ 24 తర్వాత ఇప్పటి వరకు డీజిల్ రేటు లీటరుకు రూ.1.25 పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని దేశీయ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

నా కొడుకు బతికుండగానే కోడలికి వితంతు పెన్షన్ ఎట్లిస్తరు?: తల్లి ఆవేదన

5 నెలల చిన్నారిపై హత్యాచారం.. ఏ శిక్ష వేసినా తక్కువేనన్న జడ్జి

చలాన్ తప్పించుకునేందుకు బానెట్‎పై పోలీస్‎తో దూసుకెళ్లిన డ్రైవర్