ఈ నగరాల్లో.. కేజీ టమాటాకు.. లీటరున్నర పెట్రోల్ వస్తుంది

ఈ నగరాల్లో..  కేజీ టమాటాకు.. లీటరున్నర పెట్రోల్ వస్తుంది

టమాట.. ఎవర్నీ కదిలించినా ఇదే మాట. కూరగాయల చరిత్రలో.. ధర రక రోడ్లపై పారేయాలన్నా.. ధర విపరీతంగా పెరిగి సామాన్యులు, మధ్య తరగతి వారికి దొరక్కుండా కొండెక్కి కూర్చోవాలన్నా ఈ కాయగూరతోనే సాధ్యం. వారం రోజులుగా దీని ధర ఎంతలా పెరిగిందో అనుభవంలో ఉన్నదే. ప్రస్తుతం ఒక్కో చోట కిలో రూ.200 కూడా పలుకుతుండటం సామాన్యులకు కన్నీరు తెప్పిస్తోంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో  కేజీ టమాటాల కోసం ఇచ్చే డబ్బులతో లీటరున్నర పెట్రోల్​ కొట్టించుకునే పరిస్థితి ఏర్పడింది.  ఆ ప్రాంతాలేంటో చూద్దాం..

హైదరాబాద్ లో కిలో టమాటా రూ.150, లీటర్​ పెట్రోల్​ రూ.109.66,  ఢిల్లీలో టమాటా  రూ.120 – 140 , లీటర్​పెట్రోల్​ రూ.96.72 ఉంది. చెన్నైలో టమాటా రూ.117 ఉండగా పెట్రోల్​ రూ.102.63 గా ఉంది. ముంబయిలో టమాటా రూ.110, పెట్రోల్​ రూ.106.31గా ఉన్నాయి. మొరదాబాద్ లో టమాటా రూ.150, పెట్రోల్ రూ.96.83, సిలిగురిలో టమాటా రూ.155, పెట్రోల్ రూ.106.03, కోల్​కతాలో టమాటా రూ.148, పెట్రోల్​రూ.106.03, బెంగళూరులో టమాటా రూ.100, పెట్రోల్ రూ.101.94 గా ధరలు ఉన్నాయి. అకాల వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల టమాటాల దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వస్తే కానీ ధరల్లో తగ్గుదల ఉండదని నిపుణులు అంటున్నారు.