హైదరాబాద్ లో ఇవాళ్టి పెట్రో ధరలు

హైదరాబాద్ లో ఇవాళ్టి పెట్రో ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొద్ది రోజులుగా సామాన్యుడిపై భారం మోపుతున్నాయి ఆయిల్ కంపెనీలు. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయల 29 పైసలు...లీటర్ డీజిల్ ధర 97 రూపాయల 2 పైసలకు పెరిగింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 114 రూపాయల 14 పైసలకు చేరగా... లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 12 పైసలకు పెరిగింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయల 78 పైసలకు చేరగా...డీజిల్ ధర 100 రూపాయల 14కు పెరిగింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 36 పైసలు పెరగగా...డీజిల్ పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 63 పైసలకు పెరగగా...లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 84 పైసలకు చేరింది.