వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్ రేటు

వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్ రేటు

దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పైపైకి పోతున్నాయి. వరుసగా ఇవాళ మూడో రోజు పెట్రోల్ రేట్లు పెరిగాయి.  దేశ రాజధాని ఢిల్లీలో శనివారం పెట్రోల్‌పై 25 పైసలు పెరిగి రూ.101.89 నుంచి రూ.102.14కు చేరింది. డీజిల్‌పై 30 పైసలు పెరిగి.. రూ.90.17 నుంచి రూ.90.47కు చేరింది. ముంబై సిటీలో పెట్రోల్‌పై 24 పైసలు పెరిగి, లీటర్ ధర రూ.108.19కి అయ్యింది. అలాగే డీజిల్ 32 పైసలు ఎగబాకి, రూ.98.16కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌పై కొత్తగా 26పైసలు పెరిగింది. దీంతో తాజా రేటు రూ.106.26కు చేరింది. ఇక డీజిల్‌ లీటరు రేటు రూ.98.72కు పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు పెరడగంతో భారత్‌లోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీల వర్గాలు చెబుతున్నాయి.

సిటీల వారీగా పెరిగిన రేట్లు..

సిటీ                 పెట్రోల్        డీజిల్

హైదరాబాద్    రూ.106.26    రూ.98.72

ఢిల్లీ                  రూ.102.14    రూ.90.47

ముంబై              రూ.108.19    రూ.98.16

చెన్నై                 రూ.99.80        రూ.95.02

కోల్‌కతా              రూ.102.77    రూ.93.27

మరిన్ని వార్తల కోసం..

ప్రపంచంలోనే అతి పెద్ద ఖాదీ జాతీయ జెండా

నకిలీ బంగారం తాకట్టు.. రూ.6 కోట్ల మోసం