నకిలీ బంగారం తాకట్టు.. రూ.6 కోట్ల మోసం

నకిలీ బంగారం తాకట్టు.. రూ.6 కోట్ల మోసం

నకిలీ బంగారంతో ఓ మోసగాడు సుమారు 200 మందిని బురిడీ కొట్టించి.. దాదాపు రూ.6 కోట్లకు పైగా సొమ్ము వెనకేసుకున్నాడు. చివరికి గతంలో ఒకసారి మోసగించిన వ్యక్తిని మరోసారి మాయ చేయాలని వచ్చి అడ్డంగా దొరికిపోయి.. జైలు పాలయ్యాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెంకటరెడ్డి అనే ఓ మోసగాడు వెండి ఉంగరాలకు బంగారు పూత పూసి, హాల్ మార్క్ గుర్తు వేయించి అవి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటూ బంగారు షాపులు, తాకట్టు దుకాణాల వాళ్లను మోసం చేస్తున్నాడు. ఇలా బోరబండలో నగల వ్యాపారి గణేష్ చౌదరి వద్ద గతంలో రెండు ఉంగరాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లాడు. అయితే చాలా రోజుల వరకు డబ్బు కట్టి వాటిని తీసుకెళ్లేందుకు వెంకట్ రెడ్డి రాకపోవడంతో గణేష్ చౌదరి ఆ ఉంగరాలను కరిగించగా.. అవి నకిలీవని తేలాయి. అయితే రెండు రోజుల క్రితం మళ్లీ నకిలీ బంగారు ఉంగరాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టేందుకు రావడంతో వెంకటరెడ్డిని పట్టుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పజెప్పాడు. హైదరాబాద్ సిటీలో 200 మంది దగ్గర నకిలీ బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి సుమారు 6 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత

గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది

మధ్యప్రదేశ్​లో బాలికపై గ్యాంగ్​ రేప్