ప్రపంచంలోనే అతి పెద్ద ఖాదీ జాతీయ జెండా

ప్రపంచంలోనే అతి పెద్ద ఖాదీ జాతీయ జెండా

మహాత్మా గాంధీ జయంతి రోజున మంచు కొండల మధ్య ఎగిరిన మువ్వన్నెల జెండా ప్రపంచ రికార్డు సృష్టించింది. లఢఖ్‌లోని లేహ్‌లో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ప్రపంచంలోనే అతి పెద్ద ఖాదీ జెండాను ఎగురువేశారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ దీనిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే సహా పలువురు ఆర్మీ, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

కాగా, జాతి పిత మహాత్మ గాంధీజీ, దివంగత ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారిరువురికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. న్యూఢిల్లీలోని రాజ్‌ ఘాట్, విజయ్ ఘాట్‌లలో గాంధీజీ, శాస్త్రిల సమాధులకు పూలు సమర్పించి నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ మహోన్నతమైన విలువలు, మార్గదర్శనం ప్రపంచం మొత్తానికి గొప్ప శక్తినిస్తున్నాయని ఆయన అన్నారు. అలాగే లాల్‌బహదుర్ శాస్త్రి జీవితం దేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోడీ అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు కూడా గాంధీజీ, లాల్ బహదుర్ శాస్త్రిలకు వారి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.

మరిన్ని వార్తల కోసం..

మునుపటి కంటే ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా చేస్త

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత

 

గ్యాస్ సిలిండర్ ధర రూ.43 పెరిగింది