పెరిగిన పెట్రోల్ ధర.. మూడు వారాల్లో 15సార్లు

V6 Velugu Posted on Oct 16, 2021

ఆయిల్ కంపెనీల పెట్రో బాదుడు ఆగడం లేదు. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మూడు వారాల్లో పెట్రోల్ ధరలు 15సార్లు ఎగబాకాయి. ఈ రోజు పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల  73 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ 102 రూపాయల 80 పైసలకు చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయల 49 పైసలు కాగా.. డీజిల్ 94 రూపాయల 22 పైసలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 111 రూపాయల 43 పైసలు ఉండగా.. డీజిల్ ధర 102 రూపాయల 15 పైసలుగా ఉంది.

Tagged business, diesel, petrol, Oil companies, diesel price, Price price

Latest Videos

Subscribe Now

More News