తమిళనాడు బీజేపీ కార్యాలయంపై బాటిల్ దాడి

తమిళనాడు బీజేపీ కార్యాలయంపై  బాటిల్ దాడి

తమిళనాడు కోయంబత్తూరు బీజేపీ కార్యాలయంపై ఇన్ ఫ్లేమబుల్ పదార్థంతో బాటిల్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాన్ని ఉగ్రదాడిగా పరిగణించాలన్నారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు.. ఆందోళన చేపట్టకుండా బీజేపీ కార్యకర్తలకు సర్ది చెప్పారు. నిన్నటి కేంద్రఏజెన్సీల దాడుల్లో PFI జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇస్మాయిల్ ను కోయంబత్తూర్ లో అదుపులోకి తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా.. కావాలనే..PFI బీజేపీ ఆఫీస్ పై దాడి చేపట్టిందన్నారు కార్యకర్తలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ప్రాథమిక విచారణ చేపట్టారు.