వ్యాక్సిన్​ కంపెనీల లాభం.. సెకన్​కి వెయ్యి డాలర్లు

V6 Velugu Posted on Nov 17, 2021

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను అమ్మడం ద్వారా ఫార్మా కంపెనీలయిన ఫైజర్‌‌‌‌, బయోఎన్‌‌టెక్‌‌, మోడర్నాలు కలిసి నిమిషానికి 65 వేల డాలర్ల (రూ. 49 లక్షల) లాభాన్ని సంపాదించాయని ఓ ఎనాలసిస్‌‌లో తేలింది.  ఈ ఫార్మా కంపెనీలు  పేద దేశాలకు తమ వ్యాక్సిన్లను అమ్మకుండా, ధనిక దేశాలకు అమ్మి  లాభాలు గడించాయని  పీపుల్స్‌‌ వ్యాక్సిన్‌‌ అలియన్స్‌‌ (పీవీఏ) రిపోర్ట్‌‌ వెల్లడించింది.  ఈ మూడు ఫార్మా కంపెనీల ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్‌‌ 34 బిలియన్ డాలర్లకు పెరిగిందని, అంటే సెకెన్‌‌కు వెయ్యి డాలర్లు లేదా రోజుకి 93.5 మిలియన్​ డాలర్ల లాభాన్ని ఈ మూడు కంపెనీలు పొందాయని వివరించింది.  ‘పేద దేశాల్లో కేవలం రెండు శాతం దేశాలు మాత్రమే  వ్యాక్సినేషన్‌‌ను జరిగింది. అయినా,  కొన్ని కంపెనీలు మాత్రం ప్రతీ గంటకు కొన్ని లక్షల డాలర్ల ప్రాఫిట్‌‌ను సంపాదించడం చూస్తుంటే అసహ్యంగా ఉంది’ అని ఆఫ్రికన్ అలియెన్స్‌‌ అండ్ పీపుల్స్‌‌ వ్యాక్సిన్‌‌ అలియెన్స్ ఆఫ్రికా ప్రకటించింది. ‘ఫార్మా సెక్టార్‌‌‌‌లో తమకున్న ఆదిపత్యాన్ని ఉపయోగించుకొని ఫైజర్‌‌‌‌, బయోఎన్‌‌టెక్‌‌, మోడర్నా కంపెనీలు పేద దేశాలను  కీకట్లో వదిలేశాయి’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఫైజర్‌‌‌‌, బయోఎన్‌‌టెక్ కంపెనీలు కలిసి తమ వ్యాక్సిన్‌‌ సప్లయ్‌‌లో  ఒక శాతం కూడా పేద దేశాలకు సప్లయ్ చేయలేదని విమర్శించింది.

Tagged corona vaccine, corona virus, Analysis, profit, Pfizer, Moderna, BioNTech, thousand dollars

Latest Videos

Subscribe Now

More News