రేపటి నుంచే TS PGE CET దరఖాస్తులు ప్రారంభం

రేపటి నుంచే TS PGE CET దరఖాస్తులు ప్రారంభం

పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేయడానికి ప్రభుత్వం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్  పీజీఈ సెట్ నోటిఫికేషన్ మార్చ్ 12న రిలీజ్ అయింది. తెలంగాణలోని పీజీ కళాశాలల్లో 2024-- --25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్ -డి కోర్సుల్లో చదవడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరుపున JNTU హైదరాబాద్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మార్చి 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే చాలు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తుల సవరణ మే 14 నుంచి 16 మ‌ధ్య చేసుకోవచ్చు. రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీకరించనున్నారు. మే 28 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 6 నుంచి 9 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు బీఈ,బీటెక్,బీఆర్క్,బీప్లానింగ్,బీఫార్మసీ, బీఎస్సీ ఉత్తీర్ణులై వారు అర్హులు.