డోలో 650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

డోలో 650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కరోనా సమయంలో రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేసినందుకు వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంటూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టుల విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని.. కోవిడ్ సోకినప్పుడు తనకు కూడా వైద్యులు ఈ ట్యాబ్లెట్ నే సూచించారని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

ఫార్మా కంపెనీలు నైతికంగా వ్యవహరించేలా చూడటం చాలా ముఖ్యమని పిల్లో మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీలు డాక్టర్లకు ముడుపులు అందించకుండా నిరోధించే చట్టమేమి లేదని తెలిపింది. ఈ వాదనలు విన్న ధర్మాసనం 10 రోజుల్లో తన అభిప్రాయం తెలియజేయాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. 

మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ డోలో-650 మాత్రలను తయారు చేస్తోంది. 2020లో కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఆ కంపెనీ రికార్డు స్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లు విక్రయించింది. ఓకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డాక్టర్లకు భారీగా ముడుపులిచ్చి  ..డోలో-650 టాబ్లెట్లను ప్రమోట్ చేసుకున్నారని ఇటీవల జరిగిన దర్యాప్తులో బయటపడింది.