5 కిలోమీటర్లు నడిచి.. ఆదివాసీలకు వైద్యం

5 కిలోమీటర్లు నడిచి.. ఆదివాసీలకు వైద్యం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలం వాన్వాట్ పంచాయతీ అనుబంధ గ్రామమైన మంగ్లీ తండాలో మంగళవారం అకోలి పీహెచ్​సీ సిబ్బంది హెల్త్ క్యాంప్​ఏర్పాటు చేశారు. ఈ తండాలో 11  ఆదివాసీ కుటుంబాల్లో 52 మంది కొలాం గిరిజన జాతివారు నివసిస్తున్నారు. వాన్వాట్ నుంచి తండాకు వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. వెహికల్స్​కూడా వెళ్లవు. అయినప్పటికీ హెల్త్ సూపర్​వైజర్ మర్సకొల లక్ష్మీబాయి, హెల్త్ అసిస్టెంట్లు పవార్, ప్రేమ్ సింగ్ రాథోడ్,  నారాయణ, విజయలక్ష్మి, ఆశ కార్యకర్త వైద్య కిట్లను మోస్తూ రాళ్లదారిపైనే 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. తండాలో శిబిరం నిర్వహించారు. చిన్న పిల్లలకు ఇమ్యునైజేషన్​టీకాలు, గర్భిణులకు టీటీ ఇంజెక్షన్ ఇచ్చారు.