ఫిలిప్పీన్స్లో కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి

ఫిలిప్పీన్స్లో కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి

ఫిలిప్పీన్స్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. ఇప్పటివరకు 9 మందికి గాయాలు కాగా, 26 మంది గల్లంతయ్యారు. దక్షిణ, తూర్పు ఫిలిప్పీన్స్ రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. భారీ వర్షాలతో 1200 ఇండ్లు, 123 రోడ్లు, 12 బ్రిడ్జిలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్ లోని 63 ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 

సుమారు 4 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అంతేకాదు 15 పోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒక్క బేబే నగరంలోనే 4 కొండచరియలు విరిగిపడటంతో  22 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.