ఫోన్ ట్యాపింగ్ కేసు : పోలీసుల అదుపులో ఇద్దరు పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు : పోలీసుల అదుపులో ఇద్దరు పోలీసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు పోలీస్ అధికారులను స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఎస్ఐబీ మాజీ డీఎస్పీ  ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం వారిని తీసుకువెళ్లారని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతుండగా... ఆయన నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.  వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.  

బేగంపేటలోని ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ప్రణీత్‌‌‌‌‌‌‌‌ రావుకు కేటాయించిన రెండు రూమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచే ఈ సీక్రెట్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ప్రణీత్‌‌‌‌‌‌‌‌ రావు ప్రత్యేకంగా హార్డ్‌‌‌‌‌‌‌‌ డిస్క్‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్స్‌‌‌‌‌‌‌‌ను వినిమోగించినట్లు తెలిసింది. అయితే ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్ కోసం ఎలాంటి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగించారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ సహా ఇతర సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్స్‌‌‌‌‌‌‌‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను రాబడుతున్నారు. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు కోసం డబ్బు ఎవరిచ్చారనే సమాచారం కూడా సేకరిస్తున్నారు.