నిజం ఏంటంటే : చంద్రుడిపై ఈ ముద్రలు ఫేక్.. ఎవరూ నమ్మొద్దు..

నిజం ఏంటంటే : చంద్రుడిపై ఈ ముద్రలు ఫేక్.. ఎవరూ నమ్మొద్దు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టు 23న సాయంత్రం మిషన్ చంద్రయాన్-3 సాఫ్ట్‌గా చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. అలా చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ టచ్‌డౌన్ తర్వాత, ఇస్రో తన అంతరిక్ష నౌక ద్వారా సంగ్రహించిన చంద్రుని అనేక దృశ్యాలను పంచుకుంది. అయితే 2019లో చంద్రయాన్‌-2 క్రాష్‌ ల్యాండింగ్‌పై నిరుత్సాహానికి తెరలేపిన ఇస్రో చారిత్రాత్మక విజయంపై భారతదేశం ఆనందం వ్యక్తం చేస్తుండగా, పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఇస్రో లోగోను, భారత జాతీయ చిహ్నం అశోక్ స్తంభంతో తెలుపు రంగుపై ముద్రించి షేర్ చేస్తున్నారు. చంద్రునిపై చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ చక్రం ముద్రను చూపుతుందనే వాదనతో ఈ ఫొటో ఇప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లలో షేర్ అవుతోంది.

ఇక నిజమేంటంటే.. ఈ ఫొటో ఎడిట్ చేయబడిందని, ఫేక్ అని తాజాగా వెల్లడైంది. ఈ చిత్రం కింది భాగంలో క్రియేట్ చేసిన © క్రిషన్షు గార్గ్ అనే పేరు ఉంది, ఈ సందర్భంగా లాజికల్ ఫ్యాక్ట్స్ ఒక వ్యవస్థాపకుడు, అంతరిక్ష ఔత్సాహికుడు అయిన గార్గ్‌ని సంప్రదించింది. అతను ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అడోబ్ ఫోటోషాప్‌ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించినట్లు ధృవీకరించాడు. చంద్రునిపై చంద్రయాన్ -3 ల్యాండింగ్ కోసం కౌంట్‌డౌన్ సమయంలో ఈ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నట్లు ఈ లక్నో నివాసి చెప్పాడు.

"ఎలాంటి ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయకూడదని నా ఉద్దేశం. నేను ల్యాండింగ్‌కు పది గంటల ముందు కౌంట్‌డౌన్ స్టోరీని పోస్ట్ చేసాను. అయితే ల్యాండింగ్ తర్వాత ప్రజలు దానిని నిజమైన చిత్రంగా ఎలా షేర్ చేసారో నాకు తెలియదు. నేను కూడా షాక్ అయ్యాను" అని గార్గి చెప్పాడు.