Mirai Box Offiec : 'మిరాయ్' దూకుడు.. జస్ట్ 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తేజ సజ్జా!

Mirai Box Offiec : 'మిరాయ్' దూకుడు.. జస్ట్ 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తేజ సజ్జా!

టాలీవుడ్ యంగ్ హీరోస్ తేజ సజ్జా, మంచు మనోజ్ కలిసి నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'మిరాయ్.  ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. భారీగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.  మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షక్షులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంప వ్యాప్తంగా రూ. 100 కోట్ల మైలు రాయిని అధిగమించినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

'మిరాయ్' దూకుడు..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ 'మిరాయ్' చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల వసూళ్లను సాధించింది. ఐదో రోజైన మంగళవారం నాడు భారతీయ థియేటర్లలో రూ.7 కోట్లకు పైగా వసూలు చేసింది. అటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ఐదు రోజులలోనే  సుమారు రూ.101 కోట్ల మేర వసూళ్లు చేసినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.. దీంతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఒకటిగా 'మిరాయ్' నిలబెట్టింది.

ALSO READ : Tamannaah: తమన్నా బీరు ఫ్యాక్టరీ పెట్టిందా? లేదా? ఆసక్తిరేపుతున్న మిల్క్ బ్యూటీ కొత్త ఐడియా!

నటీనటుల అద్భుత ప్రదర్శనకు ఫాన్స్ ఫిదా.. 

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రతి నాయకుడిగా నటించిన మంచు మనోజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసి..  సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. వీరితో పాటు జగపతి బాబు, రితిక నాయక్, శ్రియా శరణ్‌ల నటన కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంచు మనోజ్ కు చాలా కాలం తర్వాత తిరిగి వెండితెరపై తన మార్క్ ప్రదర్శనతో అభిమానుల మెప్పించారు.  ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాల కలయికతో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

రూ. 200 కోట్ల మార్క్‌ను దాటేనా?

ప్రస్తుతం 'మిరాయ్' ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం సినిమా దూకుడు చూస్తుంటే  రూ. 200 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతమున్న హైప్, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, 'మిరాయ్' భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.  ఈ సినిమా భారీ విజయం తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కథాబలం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది..