సైంటిస్టుల వింత ప్రయోగం .. పంది-కోతి సృష్టి

సైంటిస్టుల వింత ప్రయోగం .. పంది-కోతి సృష్టి

చైనాలో ఇటీవల రెండు పంది పిల్లలు పుట్టాయి. రెండూ చూడటానికి మామూలు పంది పిల్లల్లాగే ఉంటాయి. కానీ.. లోపల డీఎన్ఏలు మాత్రం రెండుంటాయి! బీజింగ్లోని ‘స్టేట్ కీ ల్యాబొరేటరీ ఆఫ్​స్టెమ్ సెల్అండ్ రీప్రొడక్టివ్ బయాలజీ’ సైంటిస్టులు వీటిని సృష్టించారు. ఎలా చేశారంటే.. కోతిమూలకణాలను ఫెర్టిలైజ్ చేసిన పంది పిండాలలోకి చొప్పించారు. వాటిని సరోగేట్ పంది గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఈ రెండూ తల్లి గర్భంలో డెవలప్ అయి, ‘పిగ్–మంకీ’లుగా పుట్టేశాయి. ఇలా రెండు వేర్వేరు జాతుల జంతువుల డీఎన్ఏతో సంకరం చేసి పుట్టించే జంతువులను ‘కైమెరా ’లుగా పిలుస్తారు. ఇలా పూర్తి స్థాయిలో కోతి, పంది డీఎన్ఏ ఉండే కైమెరాలను సృష్టించడం ఇదే తొలిసారని అంటున్నారు. బాగుంది కానీ..ఇలాంటి పిచ్చి ప్రయోగాలతో ఉపయోగమేందీ ? అంటున్నారా ! ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే మస్త్ లాభాలున్నాయని దీనిని సృష్టించిన టీం మెంబర్ టాంగ్ హాయ్ అంటున్నా రు. ఇదే పద్ధతిలో జంతువుల్లో మనుషుల అవయవాలనూ ఉత్పత్తి చేయొచ్చని, ఆ అవయవాలు డెవలప్ అయ్యాక, తీసుకుని మనుషులకు మార్పిడి చేసుకోవచ్చని చెప్తున్నారు. అయితే, ప్రపంచంలోని ఏ దేశ చట్టాలు కూడా మనుషులపై ఇలాంటి ప్రయోగాలకు ఒప్పుకోవుకాబట్టి.. ప్రస్తుతానికి తాము మనుషులతో ప్రయోగాల జోలికి పోవడం లేదని చైనా సైంటిస్టులు వెల్లడించారు.

ఢిల్లీ లో సజ్జనార్… ఎన్ కౌంటర్ పై సుప్రీంలో విచారణ