V6 News

నాగర్ కర్నూల్ జిల్లాలో ఏనుగు ఆకారంలో పంది పిల్ల జననం...వింత చూసేందుకు బారులు తీరిన జనం

నాగర్ కర్నూల్  జిల్లాలో ఏనుగు ఆకారంలో పంది పిల్ల జననం...వింత చూసేందుకు బారులు తీరిన జనం

  కోడేరు(పెద్దకొత్తపల్లి), వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లాలో పంది కడుపులో ఏనుగు ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందులు పెంచుతున్నాడు. ఒక పందికి మొదటి ఈతలో ఏడు పిల్లలు పుట్టాయి. ఇందులో రెండు పిల్లలు చనిపోగా, వాటిలో ఒకటి అచ్చం ఏనుగును పోలి ఉంది. 

దీంతో పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిందనే విషయం వైరల్​ అయింది. గ్రామస్తులు ఈ వింతను చూసేందుకు వెంకటయ్య ఇంటికి బారులుదీరారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లు జరిగిందని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.