‘పింక్​ లేక్​’ చూస్తే ఈతకొట్టకుండా ఉండలేరు

‘పింక్​ లేక్​’ చూస్తే ఈతకొట్టకుండా ఉండలేరు

చెరువులకు ఏదో ఒక పేరుంటది. ఇది పేరుకు తగ్గ చెరువు. పేరులో పింక్​ ఉన్నట్టే ఈ చెరువు నీళ్లలో పింక్​ కలరుంది. చూడండి ఎట్లా కనిపిస్తోందో? చూడగానే.. ‘నీళ్లలో ఎవరైనా గులాల్​ కలిపారా? ’ అనిపిస్తోంది కదా! 

ఈ ‘పింక్​ లేక్​’ పశ్చిమ ఆస్ర్టేలియాలో సముద్ర తీరానికి దగ్గరలో ఉంది. గులాబీ రంగులో ఉండే ఈ చెరువు చాలా కాలం చీకట్లలోనే ఉండి పోయింది. మాథ్యూ ఫ్లిండర్స్​ 1802లో దీన్ని గుర్తించి వెలుగులోకి తెచ్చిండు. పింక్​ లేక్​ కృత్రిమ సరస్సు. మూడు వైపులా సముద్రం ఉన్న చిన్న భూభాగంలో ఈ పింక్​ లేక్​ ఉంది. ఈ చెరువు చుట్టూ ఇసుక, పచ్చని చెట్ల వరుస ఉంది. చూడముచ్చటైన ఈ చెరువు ఈదడానికి కూడా అనువైనదే. 

రంగు ఎక్కడిది? 
ఈ పింక్​ చెరువుని ‘సెలైన్​ లేక్’​ అని కూడా పిలుస్తారు. సెలైన్​కి దీనికి ఏమిటి సంబంధం? అంటే.. సెలైన్​లో సోడియం ఉంటుంది. అలాగే ఈ చెరువులో కూడా సోడియం ఎక్కువగా ఉందట. నీటిలో ఉప్పుతోపాటు ఇంకొన్ని మినరల్స్​ కూడా ఉన్నాయి. కాబట్టి దీని చిక్కదనం మామూలు మంచి నీటి చెరువులలో కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ ఉప్పు, ఇతర మినరల్స్​ వల్లే నీళ్లు పింక్​ కలర్​లోకి మారిపోయాయి. సముద్రపు నీటిలో కూడా ఉప్పు ఉంటుంది. మరి దాని రంగు బ్లూ కలర్​లోనే ఉంది కదా? అంటే.. సముద్రపు నీటిలో ఉండే ఉప్పు కంటే ఈ పింక్​ లేక్​ నీటిలో ఉప్పు, మినరల్స్​ ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీనికి ఈ రంగు వచ్చిందని సైంటిస్టులు తేల్చేశారు. 600 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు ఉన్న ఈ చెరువులో ఈత కొట్టడానికి టూరిస్టులు బాగా పోతున్నారు. ఫొటో షూట్​కి  అనుకూలమైన ప్లేస్​ ఇది. ఈ నీళ్లలో ఈదితే హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఏమీ ఉండవు. తర్వాత సముద్రంలో మునిగితే ఒంటికి పట్టిన ఉప్పు వదిలిపోద్ది.