చేపల మార్కెటింగ్​పై సర్కార్​ దృష్టి : పిట్టల రవీందర్​

చేపల మార్కెటింగ్​పై సర్కార్​ దృష్టి : పిట్టల రవీందర్​
  •  మత్స్య సహకార సంఘం చైర్మన్​ పిట్టల రవీందర్​

నారాయణపేట, వెలుగు : చేపలను ప్రభుత్వమే కొని మార్కెటింగ్​ చేసి లాభాలను మత్స్యకారులకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని మత్స్య సహకార సంఘం రాష్ట్ర చైర్మెన్​ పిట్టల రవీందర్​ తెలిపారు. మంగళవారం ముదిరాజ్​ మహాసభ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన​మాట్లాడుతూ రాష్ట్రంలోనే నారాయణపేట, మక్తల్​లో ముదిరాజ్​లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. చెరువుల్లో వదిలే చేపపిల్లల సైజ్, కౌంట్​ సరిగా చూసుకోవాలని సూచించారు. 

చేపలను దళారులకు అమ్మకుండా, ప్రభుత్వం కొనే ఆలోచన చేస్తుందని తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారికి మత్స్య సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలన్నారు. మార్కెటింగ్​ సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు సరాఫ్​ నాగరాజ్, మత్స్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్, పాడువల్లి రాములు, హన్మంతు, పుట్టి ఈదప్ప, నర్సింలు నాయుడు పాల్గొన్నారు.