వానాకాలం​ పంటల సాగుకు ప్రణాళిక రెడీ

వానాకాలం​ పంటల సాగుకు ప్రణాళిక రెడీ

మెదక్/సంగారెడ్డి/ సిద్దిపేట, వెలుగు : వానాకాలం సీజన్​ పంటల సాగుకు ప్రణాళిక రెడీ అయ్యింది. అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​(ఏఈవో)ల ద్వారా క్లస్టర్ల వారీగా ఫీల్డ్​ లెవల్​లో సమాచారం సేకరించి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 16,79,220 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందుకు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

మెదక్ జిల్లాలో...

జిల్లాలోని 76 అగ్రికల్చర్​ క్లస్టర్ల పరిధిలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 3,31,280 ఎకరాల్లో సాగవుతాయని అగ్రికల్చర్​ డిపార్ట్​ మెంట్​అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 1.75 లక్షల ఎకరాలు ఉండగా, సెకండ్​ ప్లేస్​లో పత్తి 92 వేల ఎకరాలు, థర్డ్​ప్లేస్​లో కంది 21 వేల ఎకరాలుగా ఉంది.  ఆ తర్వాత మొక్కజొన్న 19 వేలు, పెసర 4 వేలు, మినుము 3 వేలు, జొన్న 3 వేలు, హార్టికల్చర్​ క్రాప్​5 వేలు, ఇతర పంటలు 9 వేలక ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా వేశారు. సాగు చేసేందుకు విత్తనాలు వరి 43,750, కంది 840, మొక్కజొన్న 1,140, జొన్న 120, మినుము 120, పెసర 160 క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆయా పంటలు వేసేందుకుగాను అన్ని రకాల ఎరువులు కలిపి 97,050 మెట్రిక్​ టన్నులు అవసరమవుతాయని నిర్ధారించారు. ఇందులో యూరియా 41,000, కాంప్లెక్స్​ ఎరువులు 34,200, మ్యూరేట్​ ఆఫ్​ పొటాష్​ 8,750, డీఏపీ 8,600, సింగిల్​ సూపర్​ పాస్పెట్​ 4,500 మెట్రిక్​ టన్నులు అవసరమవుతాయని లెక్కగట్టారు.  

సంగారెడ్డి జిల్లాలో...

జిల్లాలో 7,46,700 ఎకరాలలో సాగు జరగనున్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. అన్ని పంటల్లోకెల్లా పత్తి పంటను ఎక్కువ  విస్తీర్ణం కానున్నట్లు తెలిపారు.  పత్తి 3,61,167 ఎకరాలలో సాగు చేయగా, ఈసారి 3,99,000 ఎకరాలలో పత్తి సాగు కానుంది. కంది పంట గతేడాదిలో 90,655 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 1,08,000 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. సోయాబీన్ 56,473 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 72,800 ఎకరాల్లో, వరి ఈసారి19,500 ఎకరాల్లో సాగు కానున్నట్లు తెలిపారు.  విత్తనాలు పత్తి 7.98 లక్షల ప్యాకెట్లు, సోయా బీన్  21,840, వరి 19,500, పెసర 1,760, మినుము 960, కందులు 4320, మొక్కజొన్న 1610  క్వింటాళ్లు అవసరం కానున్నట్లు అంచనా వేశారు. పచ్చి రొట్టె విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలను65 శాతం సబ్సిడీపై 52 కేంద్రాల ద్వారా పంపిణీ చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు చేసింది. ఎరువులను మార్క్​ఫెడ్, ప్రైవేట్ డీలర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంచారు. యూరియా 40,580, డీఏపీ 15,882, పొటాష్  19,657, 20-20(ట్వంటీట్వంటీ) 36,421, సల్ఫర్ 09,132 మెట్రిక్​ టన్నులు అవసరం కానున్నట్లు అంచనా వేశారు.

సిద్దిపేట జిల్లాలో...

జిల్లాలో ఈ వానాకాలం  సీజన్ లో 6,01,240 ఎకరాలలో సాగుబడి జరగనున్నట్లు అంచనాలు తయారు చేశారు. వీటిలో  5,46,240 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయల తోటల సాగు జరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు రూపొందించారు. జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించగా అందుకు 62,500 క్వింటాళ్ల విత్తనాలు, 2 లక్షల ఎకరాల్లో పత్తికి గాను 1800 క్వింటాళ్లు, 40 వేల ఎకరాల్లో కందులకు గాను 1600 క్వింటాళ్లు, 50 వేల ఎకరాల్లో మొక్కజొన్నకు గాను 4000 క్వింటాళ్లు, 1000 ఎకరాల్లో పెసర్లకు గాను72 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.  ఇక ఎరువులకు సంబంధించి యూరియా 49888 మెట్రిక్ టన్నులకు గాను 12వేలు, డీఏపీ 26440 మెట్రిక్ టన్నులకు గాను18900, ఎంవోపీ 8270 మెట్రిక్ టన్నులకుగాను 600 టన్నులు, కాంప్లెక్స్ 51884 మెట్రిక్ టన్నులకు గాను 13200 టన్నులు అందుబాటులో ఉంది. మిగతా ఎరువులు సమకూర్చేందుకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Karnataka farmers seek more fertiliser subsidy- The New Indian Express

 

ఇవి కూడా చదవండి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ దందా

స్లోగా సూర్యాపేట అభివృద్ధి పనులు

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు