కాగితపు విమానాలు గాల్లో విసిరి రికార్డ్

కాగితపు విమానాలు గాల్లో విసిరి రికార్డ్

చిన్నప్పుడు సరదాగా కాగితపు విమానాలు చేసి ఆడుకోనివాళ్లు ఉండరు. అలా కాగితపు విమానాలు గాల్లో విసిరి కూడా రికార్డ్‌‌లు కొట్టొచ్చు తెలుసా! అదే పని చేసి ఇప్పుడు గిన్నిస్ బుక్‌‌ ఆఫ్​ వరల్డ్‌‌ రికార్డ్స్‌‌లోకి ఎక్కారు కిమ్‌‌ క్యూ టే, షిన్‌‌ మూ జూన్‌‌.

సౌత్‌‌ కొరియాకు చెందిన కిమ్‌‌, షిన్ ఇద్దరూ స్నేహితులు. వీళ్లు కాగితంతో తయారుచేసిన విమానాన్ని 77.134 మీటర్స్‌‌ అంటే 253 అడుగుల దూరం విసిరి రికార్డ్‌‌ కొట్టారు. ఈ రికార్డ్‌‌ 2012లో అమెరికాకు చెందిన జో అయూబ్‌‌, జాన్ ఎమ్‌‌. కాలిన్స్‌‌ పేరిట ఉంది. వాళ్లు 69.14 మీటర్లు అంటే 227 అడుగుల దూరం విసిరి రికార్డ్‌‌ నెలకొల్పారు. అదే రికార్డ్‌‌ను కిమ్‌‌, షిన్ ఇప్పుడు తిరగరాశారు. వీళ్లలో షిన్ పేపర్‌‌‌‌తో విమానం చేస్తాడు. కిమ్‌‌ విసురుతాడు.

2012లో ఆ రికార్డ్‌‌ గురించి విన్నపుడే దాన్ని బ్రేక్‌‌ చేయాలి అనుకున్నారు. అప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ దూరాన్ని విసరడం చాలా తేలికనుకున్నారు. 2019లో చేసిన అటెంప్ట్‌‌ ఫెయిల్‌‌ అయింది. తరువాత నుంచి ఇంకా ఎక్కువ కష్ట పడ్డారు. షిన్ విమానాన్ని తయారుచేయడంలో మెలకువలు తెలుసుకున్నాడు. కిమ్‌‌ దాన్ని ఎలా విసరాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు కిమ్‌‌ కొరియాలో ‘బెస్ట్‌‌ పేపర్‌‌‌‌ ప్లేన్ త్రోవర్‌‌‌‌’ అంటున్నారు అక్కడి జనాలు.

స్పెషల్‌‌ పేపర్‌‌‌‌తో..

ఈ విమానాన్ని తయారుచేయడానికి కాంకరర్‌‌‌‌ సిఎక్స్‌‌22 100జిఎస్‌‌ఎమ్‌‌ అనే స్పెషల్‌‌ పేపర్‌‌‌‌ వాడారు. ఇది మామూలు పేపరే. కానీ, కొంచెం గట్టిగా, మందంగా ఉంటుంది. ఈ విమానం తయారీ పూర్తిగా పేపర్ బరువు, జామెట్రీ మీద ఆధారపడి ఉంటుంది.  క్లోజ్డ్‌‌ ఇండోర్ స్టేడియంలో చేశారు ఈ ఈవెంట్‌‌. 
పేపర్‌‌‌‌ ప్లేన్ విసిరినపుడు ఏ మాత్రం గాలి వచ్చినా ఆ అటెంప్ట్‌‌ ఫెయిల్​ అయినట్టే.