
రీఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యారు పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ తర్వాత వరుస సినిమాలతో వచ్చేందుకు రెడీఅయ్యారు. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. సెకెండ్ వేవ్ కారణంగా ఆగాయి. వీటిలో ముందుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’రీమేక్ షూటింగ్ రీస్టార్ట్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల పదకొండున మొదలయ్యే షెడ్యూల్‌లో ముందుగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించడానికిప్లాన్ చేశారట. పవన్, రానాల మధ్య జరిగే ఈ ఫైట్ సీన్‌ని సినిమాకే హైలైట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నారట ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్. దీనికోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా పవన్ కళ్యాణ్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈగో వల్ల ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవల చుట్టూ కథ తిరుగుతుంది. రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగాస్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట త్రివిక్రమ్. అలాగే ఈ సినిమాకి ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్స్ విషయంలోనూ చాలామంది పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటించనున్నారనితెలిసింది. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘హరిహర వీరమల్లు’ సెట్‌లో కూడా త్వరలోనే జాయినవుతారట పవన్. తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిల డైరెక్షన్‌లో నటించాల్సి ఉంది.