పెట్​ ఫ్రెండ్లీ ప్లాంట్స్​

పెట్​ ఫ్రెండ్లీ ప్లాంట్స్​

ఇంట్లో పెట్స్​ పెంచుకుంటున్న వాళ్లు ఇండోర్​ ప్లాంట్స్​ పెంచాలంటే  కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొన్ని ఇండోర్​ ప్లాంట్స్​ వల్ల పెట్స్​ హెల్త్​ దెబ్బతింటుంది. అందుకే ఏ​ ప్లాంట్స్​ ఇంట్లో పెంచుకుంటే పెట్స్​కి హాని కలగదో తెలుసుకుంటే​ మంచిది కదా! వాటిలో కొన్ని ప్లాంట్స్​ ఇవి...

బర్డ్స్​ నెస్ట్ ఫెర్న్​

ఈ మొక్కల్ని బాత్​రూమ్​లో పెట్టుకోవచ్చు. తక్కువ సూర్యకాంతి, తేమ ఎక్కువతక్కువ ఉన్నా తట్టుకుని పెరుగుతుంది. వసంత రుతువు​లో ఈ మొక్కకు నెలకు ఒకసారి ఎరువు వేయాలి. కుండీలో మట్టి పైన పొడిబారినట్టు అనిపించినప్పుడల్లా నీళ్లు పోస్తుండాలి.

రోజ్​మేరీ

రోజులో ఆరు గంటలు నేరుగా సూర్యకాంతి అవసరం. నీడలో పెడితే మొక్క పెరగదు.  దీన్ని వంటలో వేస్తే మంచి ఫ్లేవర్​ ఇస్తుంది. కుక్కలు, పిల్లులు రోజ్​మేరీని తిన్నా ఏమీ కాదు.

బ్రోమెలియడ్​

ఏ గదిలో పెట్టినా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి పూలు పూస్తే కొన్ని నెలలు ఉంటుంది. ఈ పూల మీద నేరుగా ఎండ పడకపోతే చాలు. వీటికి గాలి బాగా కావాలి. ఒకటి లేదా రెండు నెలలకు ఒకసారి నీళ్లు పెట్టాలి.

ర్యాటిల్​ స్నేక్​ ప్లాంట్​

ఈ మొక్క ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండి చూసేందుకు వెరైటీగా కనిపిస్తాయి. అందుకే ఈ మొక్కకు ర్యాటిల్​ స్నేక్​ ప్లాంట్​ అనే పేరు వచ్చింది. ఆకుల మీద డిజైన్​ బ్రష్​ స్ట్రోక్​ ప్యాటర్న్​లో ఉంటుంది. వీటి మీద నేరుగా లేదా ఇండైరెక్ట్​గా ఓ మాదిరి ఎండ పడినా బాగానే పెరుగుతాయి.  ఒకటి నుంచి రెండు వారాలకు ఒకసారి నీళ్లు పోయాలి. సర్కాడియన్​ రిథమ్​ వల్ల సూర్యోదయం, సూర్యాస్తమయం టైంలో ఈ మొక్క ఆకులు పైకి కిందకు కదలడం గమనించొచ్చు.

హవోర్తియా

నెమ్మదిగా పెరిగే నాన్​ టాక్సిక్​ స.క్కులెంట్​ మొక్క. ఐదు అంగుళాలు అంటే 12 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. దీనికి మినిమల్​ కేర్​ చాలు. కొన్ని సక్కులెంట్ ప్లాంట్స్​లా కాకుండా హవోర్తియా ప్లాంట్​ పిల్లులు, కుక్కలకు సేఫ్​.

స్పైడర్​ ప్లాంట్​

ఈ మొక్కలు గాలిని, ఇంటి వాతావరణంలో ఉండే టాక్సిన్స్​ను కూడా శుభ్రం​ చేసేస్తాయి. వీటిని ఇంటిలోపల పెంచడం సులభం. బాగా పెరుగుతాయి. అయితే వీటి మీద ఎండ నేరుగా పడకూడదు.

ఫ్రెండ్​షిప్​ ప్లాంట్​చూడగానే పట్టుకోవాలనిపిస్తుంది. 

12 అంగుళాలు అంటే 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. తక్కువ లైట్​లో బాగా పెరుగుతుంది. కాకపోతే దీనికి నీళ్లు బాగా అందివ్వాలి.

బోస్టన్​ ఫెర్న్​

ఈ మొక్క ఆకుల్ని పెట్స్​ తిన్నా కంగారుపడాల్సిన పనిలేదు. దీని మెయింటెనెన్స్ కూడా అంతగా ఉండదు. రెండు నెలలకు ఒకసారి దీనికి కావాల్సిన ఫుడ్​ పెడితే చాలు. 

బేబీ టియర్స్​

హ్యాంగింగ్ బాస్కెట్స్​కు బేబీ టియర్స్​ మొక్క చాలా బాగుంటుంది. ఈ మొక్క ఆకులు కుండీలో మట్టిని కూడా కప్పేస్తాయి. అందుకని పెట్స్​ ఈ మొక్క దగ్గరకు వెళ్లి మట్టి తవ్వడం వంటివి చేయవు.

డేట్​ పామ్​

అరికేషియా కుటుంబానికి చెందిన డేట్​ పామ్​ ఇండోర్స్​లో చాలా బాగా పెరుగుతుంది. ఒకసారి పువ్వులు పూశాక ఏ గదిలో పెట్టినా సెట్​ అవుతుంది.

ప్రేయర్​ ప్లాంట్​

చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఈ అందమైన మొక్క పెట్స్​​ దృష్టిని కచ్చితంగా ఆకర్షిస్తుంది. అలాగని ఈ మొక్క దగ్గరకు పెట్స్​ వెళ్తే కంగారుపడాల్సిన పని లేదు.

గ్లోగ్జినియా 

 అందమైన ఈ మొక్క బ్రెజిల్​కు చెందింది. గులాబీ, ఊదా, ఎరుపు లేదా నీలం రంగు షేడ్స్​లో ఉంటుంది. వీటి మీద కాంతి నేరుగా పడకూడదు. నీళ్లు కాస్త ఎక్కువసార్లు పోస్తుండాలి. మందమైన ఆకులతో ఉండే మొక్క బొకేలా కనిపిస్తుంది. టేబుల్ మీద సెంటర్​పీస్​లా పెట్టుకోవచ్చు.

స్టాగ్​హోర్న్​ ఫెర్న్​

నేరుగా కాంతి పడకుండా చూడాలి. ఒకటి లేదా మూడు వారాలకు ఒకసారి నీళ్లు పెట్టాలి. బాత్​రూమ్, తేమ ఉండే ప్రాంతాల్లో ఉంచాలి. అలాకూడా మూడు వారాలకు ఒకసారి నీళ్లను స్ర్పే​ చేయాలి.

ఆఫ్రికన్​ వయొలెట్​

ఆఫ్రికన్​ వయొలెట్​ మొక్క పువ్వులు పూస్తుంది.  ఊదా, గులాబీ రంగుల కలయికతో అందంగా ఉంటుంది. తక్కువ లైటింగ్​ ఉన్నా కూడా పూలు పూస్తుంది. ఓ మాదిరి ఉష్ణోగ్రత, ఓ మాదిరి తేమ ఉన్నా చాలు. 

వీనస్​ ఫ్లై ట్రాప్​

ఈ మొక్క ఆకుల మీద ముళ్లలా కనిపించే కొనలు చూస్తే గుచ్చుకుంటాయి అనిపిస్తుంది. కానీ అవి మెత్తగా ఉండి గుచ్చుకోవు. మొక్కకు వెలుతురు, నీళ్లు కావాలి. అప్పుడే మంచి కండిషన్​లో ఉంటుంది.