ప్లాస్మా థెరపీతో నిలకడగా కరోనా రోగుల హెల్త్ కండీషన్

ప్లాస్మా థెరపీతో నిలకడగా కరోనా రోగుల హెల్త్ కండీషన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్లాస్మా థెరపీని ప్రవేశపెట్టడంతోపాటు పేషెంట్స్‌కు పల్స్ ఆక్సీమీటర్స్‌ను అందించం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించడానికి తమ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. ‘మేం టెస్టుల సంఖ్యను మూడు రెట్లు పెంచాం. కానీ అదే సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజుకు 3వేల చొప్పున పెరిగింది. ఇప్పటివరకు మొత్తం కరోనా బాధితుల్లో సుమారు 45 వేల మంది కోలుకున్నారు. ప్లాస్మా థెరపీతో ఆరోగ్యం క్షీణించిన వారిని కాపాడటం కష్టం. కానీ హెల్త్ కండీషన్ మోస్తరుగా ఉన్న వారి పరిస్థితి తీవ్రమవకుండా ఆ థెరపీ సాయపడుతుంది’ అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని లోక్‌ నాయక్ జయప్రకాశ్ నారాయణ్​ హాస్పిటల్‌ (ఎల్‌ఎన్‌జేపీ)తోపాటు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ చేయడానికి తమ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అనుమతి లభించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీంతో ఈ రెండు హాస్పిటల్స్‌లో ప్లాస్మా థెరపీ ప్రారంభమైనప్పటి నుంచి మునుపటితో పోల్చితే సగం కంటే తక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయని వివరించారు.