
ఇది ఓ గోడ. ఇటుకలు పేర్చి సిమెంటు వేసి కట్టిన గోడ కాదు. ప్లా స్టిక్ బాటిళ్లతో నిలువునా నిలిపిన గోడ. దీని పేరు ‘వాల్ ఆఫ్ హోప్ (ఆశా గోడ)’. ముస్సోరి జనం కట్టారు. 15 వేల ప్లా స్టిక్ బాటిళ్లతో 12 అడుగుల ఎత్తు తో 1500 అడుగుల పొడవున దీనిని అందంగా తీర్చిదిద్దా రు. ముస్సోరిలోని చాలా చోట్ల, దాని చుట్టుపక్కలా ఏరుకొచ్చారు ఈ ప్లా స్టిక్ బాటిళ్లు. ఈ గోడతో టూరిస్టు లకు పెద్ద మెసేజే ఇచ్చారు అక్కడి జనం.
చూడ్డానికి వస్తే వచ్చారుగానీ, తమ ప్లేస్ ను మాత్రం ప్లా స్టిక్ చెత్తతో నింపొద్దు ప్లీజ్ అన్న సందేశం పంపారు. ముస్సోరికి దగ్గర్లోని బంగళా కి కండి అనే గ్రామ పెద్ద రీనా రంగల్ తో వాల్ ఆఫ్ హోప్ ను ఓపెన్ చేయించారు. గోడకు మ్యూజియం ఆఫ్ గోవా ఓనర్ సుబోధ్ కేర్కర్ డిజైన్ చేశారు. హిల్దా రీ ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు.
దేశంలో పరిశుభ్రమైన హిల్స్టేషన్గా మార్చేందుకు చేపట్టిన ఉద్యమమే ఈ హిల్దారీ ప్రాజెక్ట్. స్కూళ్లు, కాలేజీలకు చెందిన 50 మంది వలంటీర్లు ఈ గోడ నిర్మాణంలో భాగస్వాములయ్యారని హిల్దారీ ప్రాజెక్ట్ మేనేజర్ అర్వింద్ శుక్లా చెప్పారు.