ప్లే అండ్ షైన్ ఫౌండేషన్... స్పోర్ట్స్ అంటే ప్యాషన్

ప్లే అండ్ షైన్ ఫౌండేషన్... స్పోర్ట్స్ అంటే ప్యాషన్

పదమూడేండ్ల వయసులోనే రైఫిల్ పట్టి షూటర్‌‌‌‌‌‌‌‌గా మారిన ప్రియల్‌‌‌‌కు స్పోర్ట్స్ అంటే ప్యాషన్.  ఇంటర్నేషనల్ అథ్లెట్‌‌‌‌గా మారి ఇండియాకు వందకు పైగా మెడల్స్ తెచ్చింది. ఒకసారి ఆమె గ్రామాల్లో వలంటీర్ గా  చేసేందుకు వెళ్లింది. అప్పుడు పిల్లల్ని ‘మీకు ఏయే ఆటలు తెలుసు?’ అనడిగింది.  క్రికెట్ తప్ప మరో గేమ్ తెలియదని వాళ్లు అనడంతో ఆశ్చర్యపోయింది. గ్రామాల్లోని పిల్లలకు స్పోర్ట్స్‌‌‌‌పై అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ పెంచాలనుకుంది. అలా పుట్టిందే ‘ప్లే అండ్ షైన్ ఫౌండేషన్’.

ముంబైకు చెందిన  ప్రియల్ కేని.. ప్రొఫెషనల్ రైఫిల్ షూటర్. 2008లో అథ్లెట్‌‌‌‌గా తన కెరీర్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టి, ఇండియన్ రైఫిల్ షూటింగ్ టీమ్‌‌‌‌లో ఏడేండ్లు షూటర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 117 మెడల్స్ కూడా సాధించింది. కాలేజీ రోజుల నుంచే ప్రియల్ కు వలంటరీ పనులు చేయడం ఇష్టం. అథ్లెట్‌‌‌‌గా మారాక కూడా ఊళ్లకు వెళ్తూ  రకరకాల యాక్టివిటీస్ లో పాల్గొనేది. అప్పుడామెకు గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు ఆటల్లో ఎంతో వెనకబడి ఉన్నారని  అర్థమైంది. జీవితంలో సక్సెస్ కావడానికి స్పోర్ట్స్  మంచి ఆప్షన్ అని గుర్తించిన ప్రియల్.. గ్రామాల్లోని పిల్లలకు ఎలాగైనా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అందించాలనుకుంది. తన ఫ్రెండ్ సార్థక్ సాయంతో ప్లే అండ్ షైన్ ఫౌండేషన్‌‌‌‌ మెదలుపెట్టి పిల్లలకు స్పోర్ట్స్‌‌‌‌పై  అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ కల్పిస్తోంది.

లక్ష్యం ఇదే

ప్లే అండ్ షైన్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో యాక్టివ్‌‌‌‌గా పనిచేస్తోంది. ఇందులో 500 మందికి పైగా వలంటీర్లు ఉన్నారు. ఇప్పటివరకూ నాలుగు వేల మంది పిల్లలకు రకరకాల స్పోర్ట్స్‌‌‌‌లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్లని అథ్లెట్స్‌‌‌‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ‘టాటా సస్టెయినబిలిటీ గ్రూప్’, ‘టీచ్ ఫర్ ఇండియా’, ‘డెకత్లాన్’, ‘ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ మహారాష్ట్ర’తో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకూ వెయ్యికి పైగా వర్క్‌‌‌‌షాప్స్, టోర్నమెంట్స్ నిర్వహించారు. 2030 చివరి నాటికి పదిలక్షల మంది పిల్లలను ఇంటర్నేషనల్ అథ్లెట్స్‌‌‌‌గా మార్చడమే  లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఊరు, వాడా తేడా లేకుండా పిల్లలందరికీ స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పిస్తూ తమకు నచ్చిన స్పోర్ట్స్‌‌‌‌ ఎంచుకుని రాణించే విధంగా సపోర్ట్ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలను స్పోర్ట్స్‌‌‌‌కు మరింత చేరువ చేసేందుకు ‘గర్ల్స్ ఇన్ స్పోర్ట్స్’ ప్రోగ్రామ్‌‌‌‌ మొదలుపెట్టబోతున్నారు.

గ్రౌండ్స్ నుంచి సాల్వ్ చేయాలి

“నాకు, స్పోర్ట్స్‌‌‌‌కు విడదీయరాని సంబంధం ఉంది.  జీవితంలో సక్సెస్ అవ్వడానికి స్పోర్ట్స్ ఒక మంచి ఆప్షన్ అని నేను నమ్ముతా. ఆటల్లో రాణించే ప్రతిభ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అసలు ఆటల గురించిన కనీస అవగాహన లేనప్పుడు రాణించడం ఎలా సాధ్యం? మనకు ఎన్నో రకాల స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ గ్రామాల్లోని పిల్లలకు కేవలం రెండు, మూడు ఆటలు మాత్రమే తెలుసు. ‘మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవర’ని అడిగితే అందరూ సచిన్ లేదా కోహ్లీ అనే చెప్తున్నారు. దానర్థం వాళ్లకు మిగతా ఆటలు తెలియవని. అందుకే  ఫౌండేషన్ పెట్టి, పిల్లల్ని అన్నిరకాల ఆటలకు దగ్గర చేయాలన్న ఆలోచన వచ్చింది. మా టీం  కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లినప్పుడు అక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం కనీసం స్టాఫ్ కూడా లేరని తెలిసింది. అందుకే ఈ సమస్యకు గ్రౌండ్ లెవల్ నుంచి పరిష్కారం వెతకాలనుకున్నాం. గ్రామాల్లోని గవర్నమెంట్ స్కూల్స్‌‌‌‌లో మేమే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ క్లాసెస్, వీక్లీ స్పోర్ట్స్ సెషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వాల సాయం ద్వారా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్‌‌‌‌ను దేశంలోని మరిన్ని గ్రామాలకు విస్తరించే పనిలో ఉన్నాం’’

- ‌‌‌‌‌‌‌‌ప్రియల్