మన మెదడుకు సంబంధించిన స్ట్రోక్ వస్తే ప్రతి నిమిషం చాలా విలువైనది, ఎందుకంటే మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఇలాంటప్పుడు, మెదడు కణాలు ప్రతి సెకనుకూ చనిపోతాయి. అందుకే, 4.5 గంటల్లోపు త్వరగా ఆసుపత్రికి వెళ్లడం చాలా అవసరం అని జెరోధా సహ వ్యవస్థాపకుడు & CEO నితిన్ కామత్ అన్నారు. ఈ టైంని 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారు.
ప్రతి ఏడాది అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం జరుపుకుంటారు, ఈ రోజున స్ట్రోక్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. గతేడాది స్ట్రోక్ నుంచి కోలుకున్న నితిన్ కామత్, సోషల్ మీడియా X ద్వారా తన అనుభవాన్ని షేర్ చేసారు. అందులో స్ట్రోక్ వచ్చినప్పుడు నిద్ర పోవాలని అనుకోకుండా 4.5 గంటల్లోపే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఉండాల్సింది అని చెప్పుకొచ్చారు.
నాకు ఎం జరగదు అనే ఆలోచన, ముఖ్యంగా 50 ఏళ్లలోపు వారిలో ఎక్కువగా ఉంటుందని నితిన్ కామత్ అన్నారు. అయితే, గత కొన్ని ఏళ్లలో 30 నుండి 50 సంవత్సరాల వయస్సుగల వారిలో స్ట్రోక్‌లు దాదాపు 30 శాతం వరకు పెరిగాయని ఆయన తెలిపారు. స్ట్రోక్‌ల విషయంలో టైం చాలా ముఖ్యం, ప్రతి నిమిషం లెక్కించబడుతుంది అని ఆయన చెప్పారు. స్ట్రోక్‌లకు త్వరగా చికిత్స చేయకపోతే, అది మెదడు శాశ్వతంగా దెబ్బతినడానికి , వైకల్యానికి దారితీస్తుంది. అయితే కొన్ని సింపుల్ పద్ధతులు పాటించడం ద్వారా సుమారు 80 శాతం స్ట్రోక్‌లను నివారించవచ్చని నితిన్ కామత్ చెప్పారు.
సింపుల్ పద్ధతులు ఏంటంటే:
*బిపి, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం,
*సిగరెట్, పొగాకు, మద్యం అలవాట్లు మానేయడం.
*సరైన ఆహారం తీసుకోవడం.
*ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయడం.
*కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం.
స్ట్రోక్ లక్షణాలను తెలుసుకోవడానికి కోల్‌కతాకు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ దీప్ దాస్ 'BE FAST' అనే పద్ధతిని సూచించారు:
B (బ్యాలెన్స్): నడవడంలో ఇబ్బంది లేదా పడిపోవడం.
E (Eye or vision): దృష్టిలో సమస్య.
F (face): ముఖం ఒక పక్కకు వంగిపోవడం.
A (Arm ): చేతిలో బలం తగ్గడం లేదా పట్టు కోల్పోవడం.
S (Speech /మాట్లాడటం): మాట అస్పష్టంగా, తడబడుతూ రావడం.
T (time): ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం. ఈ లక్షణాలు స్ట్రోక్ తీవ్రతను, దాని నివారణ, వెంటనే చికిత్స అవసరాన్ని చెబుతున్నాయి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం, ముందుగానే హార్ట్ స్ట్రోక్ గుర్తించి సకాలంలో వైద్యపరంగా చికిత్స చేస్తే దాదాపు 80% స్ట్రోక్‌లను నివారించవచ్చు. 2025 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, స్ట్రోక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రముఖుల గురించి...
మైఖేల్ జాక్సన్:
పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ 2009లో 58 ఏళ్ల వయసులో మరణించాడు. చాలా మంది అతని మరణానికి కారణం మాదకద్రవ్యలు మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నాడని నమ్ముతున్న కూడా అతను గుండెపోటు కారణంగా మరణించాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
షెఫాలీ జారివాలా:
కాంటాలగా సాంగ్ అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకున్న 42 ఏళ్ల షెఫాలి 27 జూన్ 2025న మరణించింది. రిపోర్ట్స్ ప్రకారం, ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమె పూజ కోసం ఉపవాసం ఉండి ఖాళీ కడుపుతో హెల్త్ టాబ్లెట్స్ వేసుకుందని చెబుతారు. ఆమె మృతికి దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమైంది.
బ్రిటనీ మర్ఫీ:
హాలీవుడ్ నటిగా, గాయనిగా, వాయిస్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన బ్రిటనీ మర్ఫీ 32 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. ఆమె గుండెపోటుకు కారణం ఇంకా మిస్టరీగానే ఉన్న... ఆమెకు బయటపడని గుండె జబ్బు, టైప్ 2 డయాబెటిస్ లేదా థైరాయిడ్ సమస్య ఉందని నమ్ముతారు. సమాచారం ప్రకారం, ఆమె స్నానం చేస్తూ కుప్పకూలిపోయిందని, అంబులెన్స్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని, హాస్పిటల్ తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె మరణించినట్లు డాక్టర్ చెప్పారు.
సతీష్ కౌశిక్:
సతీష్ కౌశిక్ ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత. మిస్టర్ ఇండియా, రామ్ లఖన్, సాజన్ చలే ససురల్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 66 ఏళ్ల ఈ బాలీవుడ్ హీరో 9 మార్చి 2023న స్ట్రోక్ వచ్చి మరణించారు.
క్రిస్టోఫర్ రీవ్:
సూపర్‌మ్యాన్ పాత్ర ద్వారా పేరు పొంది ఎన్నో ప్రశంసలు పొందిన ఈ గొప్ప నటుడు, 52 ఏళ్ల వయసులో అక్టోబర్ 2004లో మరణించాడు. గుర్రపు స్వారీ ప్రమాదం తర్వాత అతనికి పక్షవాతం వచ్చింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఇతర సమస్యల కారణంగా ఏళ్ల తరబడి కదలికలు లేకపోవడం వల్ల అతనికి స్ట్రోక్ వచ్చింది. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన అతను చివరికి కోమాలోకి జారుకొని తిరిగి కోలుకోలేదు.
సిద్ధార్థ్ శుక్లా:
ఇండియన్ టెలివిజన్ పరిశమ్రలో ప్రముఖ వ్యక్తి అయిన సిద్ధార్థ్ శుక్లా బిగ్ బాస్ 13 విజేత. 40 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు. షెఫాలి జరివాలా లాగే అతను కూడా మంచి ఆరోగ్య స్పృహ(health consious)తో ఉండేవాడు.
కృష్ణకుమార్ కున్నత్ (కెకె):
కె.కె.గా ప్రసిద్ధి చెందిన కృష్ణకుమార్ కున్నత్ భారతదేశంలోని అత్యుత్తమ నేపథ్య గాయకులలో ఒకరు. దురదృష్టవశాత్తు, కోల్‌కతాలో జరిగిన లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దింతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు. సమాచారం ప్రకారం, 53 ఏళ్ల ఈ గాయకుడి మరణానికి కారణం కూడా గుండె స్ట్రోక్.
