
యూట్యూబ్‌లో కొత్త అప్డేట్ వచ్చింది. కాకపోతే అది అందరికీ నచ్చకపోవచ్చు. చాలామందికి అది విసుగొచ్చే అప్డేట్ అనిపించొచ్చు. ఎందుకంటారా... ఆ అప్డేట్ అలాంటిది మరి.యూట్యూబ్ తీసుకొచ్చిన ఆ కొత్త అప్డేట్ ఏంటంటే.. మామూలుగా యూట్యూబ్‌లో ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అవి వచ్చేది కొన్ని సెకన్ల పాటే అయినా, చాలామంది వ్యూయర్స్‌కి చిరాగ్గా అనిపిస్తుంది. దాంతో చాలామంది స్కిప్ చేస్తుంటారు.
కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన అప్డేట్తో ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకాస్త పెరగొచ్చు. ఎందుకంటే.. కనెక్టెడ్ టీవీ (సీటీవీ) లలో 30 సెకన్ల పాటు నాన్–స్కిప్ యాడ్లను తీసుకురాబోతున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. బిగ్ స్క్రీన్‌పై ఎక్కువ రన్‌టైం ఉన్న యాడ్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి ఆడియెన్స్‌కి నచ్చుతాయని నమ్మకంగా చెప్తోంది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ సెలెక్టెడ్ వ్యూయర్స్ పెరుగుతుండడంతో ఇందులో రకరకాల కంటెంట్లు ప్రసారమయ్యే టైంలో యాడ్స్ టెలికాస్ట్ చేసుకునేందుకు యూట్యూబ్ అవకాశం కల్పించింది.