కూల్​ కూల్‌‌‌‌ టాయ్స్‌‌.. పిల్లలకు మస్తు మజా

V6 Velugu Posted on Jun 03, 2021

ప్రతి సీజన్‌‌కు స్పెషల్‌‌ టాయ్స్‌‌ దొరుకుతుంటాయి. సమ్మర్​ సీజన్‌‌కు తగ్గట్లు పిల్లలు ఎంజాయ్‌‌ చేయాలంటే ఇంకొన్ని స్పెషల్‌‌ టాయ్స్‌‌ ఉన్నాయి. ఈ టాయ్స్​ వాళ్ల దగ్గర ఉంటే చాలు ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్‌‌ చేస్తారు. 
వాటర్‌‌‌‌ స్ప్రింక్లర్స్‌‌
పైనుంచి తుంపర్లు లేదా చిరుజల్లులు పడుతుంటే తడవటం పిల్లలకి హ్యాపీగా ఉంటుంది. ఈ స్ప్రింక్లర్స్‌‌ను ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ‘జైజాంటిక్ అవుట్‌‌డోర్‌‌‌‌ వాటర్‌‌‌‌ స్ప్రింక్లర్‌‌‌‌’ను పెరట్లో అరేంజ్‌‌ చేసుకుంటే చాలు. దీనిచుట్టూ అన్నివైపుల నుంచి నీళ్లు తుంపర్లుగా పడుతుంటాయి. దీని కింద నుంచి వెళ్తూ, తడుస్తూ చిన్నారులు తెగ ఎంజాయ్‌‌ చేస్తారు.

చాక్‌‌పీస్‌‌ ఆర్ట్‌‌
పిల్లలకు చాక్‌‌పీస్‌‌లు అంటే చాలా ఇష్టం. వాటితో నేలపై, పలకలపై రకరకాల బొమ్మలు గీస్తుంటారు కదా. మామూలుగా అయితే చాక్‌‌పీస్‌‌లు పొడవుగా ఉంటాయి. కానీ, ‘సైడ్‌‌వాక్‌‌ చాక్స్‌‌’ మాత్రం డిఫరెంట్ షేప్స్‌‌లో దొరుకుతాయి. ఇవి గుండ్రంగా, రకరకాల రంగుల్లో ఉంటాయి. ఒక పీస్‌‌లో దాదాపు మూడు రంగుల వరకు ఉంటాయి. ఈ చాక్‌‌పీస్‌‌లు రాస్తున్నకొద్దీ, లోపలి రంగు బయటపడుతుంది. అలా మూడు రంగుల్లో రాయొచ్చన్నమాట. ఎప్పుడూ బొమ్మలు గీసే పిల్లలకు ఈ టాయ్‌‌ చాక్స్‌‌ భలే నచ్చుతాయి.
వాటర్‌‌‌‌ బెలూన్స్‌‌
సమ్మర్‌‌‌‌లో వాటర్‌‌‌‌ బెలూన్స్‌‌తో ఆడుకోవడం పిల్లలకు మంచి మజా ఇస్తుంది. అయితే, రెగ్యులర్‌‌‌‌గా వాడే బెలూన్స్‌‌లో నీళ్లు నింపడం కష్టమైన పని. కానీ, ‘జురు బంచ్‌‌ ఒ బెలూన్స్‌‌’తో మాత్రం ఈజీగా బెలూన్స్‌‌లో వాటర్ నింపేయొచ్చు. ఇవి సెల్ఫ్‌‌ సీలింగ్‌‌ బెలూన్స్‌‌. ఒక నిమిషంలో వంద బెలూన్స్‌‌ వరకు నీళ్లు నింపొచ్చు. 
 

Tagged life style, Fun, playing, kids, , water balloons

Latest Videos

Subscribe Now

More News