కొన్ని నిర్ణయాలు కఠినంగున్నా.. సత్ఫలితాలిస్తాయి

కొన్ని నిర్ణయాలు కఠినంగున్నా.. సత్ఫలితాలిస్తాయి

‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించకపోవచ్చు. కానీ అవే దీర్ఘకాలంలో దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్ చేశారు. సోమవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన  ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవేశపెడుతున్న సంస్కరణల ఫలితాలను రానున్న రోజుల్లో ప్రజలు కళ్లారా చూస్తారని పేర్కొన్నారు. ‘‘నేను సమయాన్ని వృథా చేసుకోకుండా.. ప్రతిక్షణం దేశసేవకు కృషిచేస్తాను’’ అని ఈసందర్భంగా మోడీ చెప్పుకొచ్చారు. సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాని గురించి నేరుగా ప్రస్తావించకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.