అభినందన్ ను విడుదల చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడిలేదు : పాక్

అభినందన్ ను విడుదల చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడిలేదు : పాక్

ప్రధాని మోడీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఫోటోలు పాకిస్తాన్ లో దర్శనమిస్తున్నాయి.

ఆ ఫోటోల్లో మోడీ, వర్ధమాన్ తో పాటు పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ పార్టీ లీడర్ ఆయాద్ సిద్ధిఖ్ ఉన్నాడు. పాకిస్తాన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ గా పనిచేసిన ఆయాద్ దేశ ద్రోహి అంటూ పోస్టర్లు వెలిశాయి. అందుకు కారణం పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలే

. గతేడాది అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ సైనికులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ అంశం పై కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆయాద్ సిద్ధఖ్ మాట్లాడుతూ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ..,పాక్ ఆర్మీ జనరల్ చీఫ్ జావెద్ బజ్వాకు…అభినందన్ ను తిరిగి భారత్ కు ఇవ్వకపోతే ప్రధాని మోడీ పాక్ పై యుద్ధం చేస్తారని, వెంటనే విడుదల చేయాలని సూచించినట్లు చెప్పారు. అయితే   షా మాటలకు పాక్ ఆర్మీ చీఫ్ కు చెమటలు పట్టి, వణికిపోయారని అన్నారు. దీంతో పార్లమెంట్ లో తీవ్ర దుమారం రేగింది.

సిద్ధఖ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఎంబసీ స్పోక్ పర్సన్ జహీద్ హఫీజ్ స్పందించారు. అభినందన్ ను విడుదల చేసే సమయంలో ఎటువంటి ఒత్తిడిలేదని అన్నారు. పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విడుదల చేసిందని చెప్పారు.