జీ-7 సమిట్​కు మోదీకి ఆహ్వానం

జీ-7 సమిట్​కు మోదీకి ఆహ్వానం


కెనడాలో వచ్చే వారం జరగనున్న  జి–7 సమిట్​లో పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈమేరకు తనకు ఫోన్ చేశారని మోదీ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన కార్నీకి అభినందనలు తెలిపానని వివరించారు. పరస్పర గౌరవాభిమానాలతో ఇండియా, కెనడా సమష్టిగా పనిచేస్తాయని మోదీ చెప్పారు.  ఇటీవలి పరిణామాలతో జీ–7 సమిట్​కు ఇండియాను ఆహ్వానించదని ప్రచారం జరిగింది. సమిట్​ గడువు దగ్గరవుతున్నా ఆహ్వానం అందకపోవడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం లభించింది.

 ఒక వేళ కెనడా నుంచి ఆహ్వానం అందినా సరే ఈ సమిట్​కు హాజరు కావొద్దని మోదీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా కెనడా ప్రధాని కార్నీ ఫోన్ చేసి ఆహ్వానించడంతో మోదీ పాజిటివ్ గా స్పందించారు. అయితే, మోదీ ఈ సమిట్​ కు హాజరవుతారా లేదా అనేదానిపై 
అధికారికంగా స్పష్టత లేదని తెలుస్తోంది.