
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, అమిత్‌షాలపై మరోసారి విమర్శలు చేశారు. వారిద్దరూ ఊహల్లో జీవిస్తుంటారన్నారు. దేశ ఆర్థిక స్థితిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. మోడీ, అమిత్ షాలకు వారి ప్రపంచంతో తప్ప… బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవన్నారు. ఇద్దరూ వారి సొంత ప్రపంచంలో విహరిస్తూ… వివిధ అంశాలపై భ్రమల్లో తేలిపోతుంటారని ఆరోపించారు. అందుకే మన దేశం ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్.