రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ...

రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ...
  • ప్రధాని భేటీ అయిన కొన్ని గంటల్లోనే హోం మంత్రి అమిత్ షా కూడా సమావేశం 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో వారిద్దరూ కొన్ని గంటల పాటు ముర్ముతో సమావేశమయ్యారు. ముందుగా ప్రధాని మోదీ భేటీ అయి వెళ్లిపోయారు. తర్వాత కొన్ని గంటలకే అమిత్ షా కూడా ముర్ముతో సమావేశమయ్యారు. అయితే, భేటీకి సంబంధించి ఎలాంటి కారణాలు తెలియరాలేదు. ప్రధాని కార్యాలయంగానీ, హోం మంత్రి కార్యాలయంగానీ ఈ సమావేశం గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. 

కానీ, రాష్ట్రపతి కార్యాలయం మాత్రం భేటీపై ‘ఎక్స్’ లో ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ, అమిత్ షా వేర్వేరుగా ముర్ముతో రాష్ట్రపతి భవన్ లో కొద్దిసేపు సమావేశం అయ్యారని రాష్ట్రపతి కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది. ముందుగా మోదీ సమావేశమై వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే అమిత్ షా కూడా సమావేశమయ్యారని వెల్లడించింది. 

కాగా.. యూకే పర్యటన నుంచి స్వదేశానికి  తిరిగివచ్చిన తర్వాత రాష్ట్రపతితో ప్రధాని భేటీ కావడం ఇదే మొదటిసారి. పార్లమెంటు సమావేశాల్లో బిహార్ లో చేపట్టిన స్పెషల్  ఇంటెన్సివ్  రివిజన్ (సర్) పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముర్ముతో మోదీ, అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.