
దేశ జవాన్లు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా వివిధ యూనివర్శిటీలు ఈ టన్నెల్‌ను ఓ ‘కేస్ స్టడీ’ గా అధ్యయనం చేయాలన్నారు ప్రధాని మోడీ.ఇవాళ(శనివారం) అటల్ టన్నెల్ ను ప్రారంభించన తర్వాత ఆయన మాట్లాడారు. కేస్ స్టడీగా అధ్యయనం చేసుందుకు విదేశాంగ శాఖ ఓ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా ఈ టన్నెల్‌ను నిర్మించిన విధానం, చేసిన శ్రమను అధ్యయనం చేయడానికి వీలుగా ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని కేంద్ర విద్యాశాఖను వెూడీ ఆదేశించారు. టన్నెల్ నిర్మాణం ప్రారంభించిన సమయంలో నిపుణులను అడిగితే… 2040 లో పూర్తవుతుందని తెలిపారు. అయితే… కేవలం ఆరేళ్లలోనే ఈ టన్నెల్ ను పూర్తి చేసి చూపించామని ఆయన చెప్పారు. పెండింగ్‌లో ఉన్న మిగితా ప్రాజెక్టులను కూడా ఇదే తరహాలో త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణెళి, హిమాచల్ సీఎంజై రాం ఠాకూర్… వెూడీ వెంట ఉన్నారు.