మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

దేశ రాజధాని రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, యూటీల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 

నీతి ఆయోగ్ సమావేశం యొక్క ఎజెండాలో పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు,వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించడంపై చర్చిస్తున్నారు. జాతీయ విద్యా విధానం, పాఠశాల విద్య అమలు తీరు, జాతీయ విద్యా విధానం ఉన్నత విద్య అమలుపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పట్టణ పాలన, స్థిరమైన, సుస్థిరమైన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ యొక్క ఏడవ పాలక మండలి సమావేశంలో  కేంద్రం,  రాష్ట్రాల మధ్య సహాయ సహకారం, సమన్వయాలకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.