డీపీగా తిరంగా పెట్టిన మోడీ

డీపీగా తిరంగా పెట్టిన మోడీ

ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా నేను నా సోషల్ మీడియా పేజీలలో డీపీని మార్చాను. మీరందరూ జాతీయ జెండాతో మీ డీపీలను మార్చాలని కోరుతున్నాను.

‑ ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్ల డీపీగా జాతీయ జెండా పెట్టారు. ‘‘ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా నేను నా సోషల్ మీడియా పేజీలలో డీపీని మార్చాను. మీరందరూ జాతీయ జెండాతో మీ డీపీలను మార్చాలని కోరుతున్నాను” అని మోడీ మంగళవారం ట్వీట్ చేశారు. అలాగే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. మన దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులూ తమ డీపీగా తిరంగా పెట్టుకున్నారు. కాగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ నెల 2 నుంచి 15 వరకు ప్రజలందరూ తమ డీపీగా తిరంగా పెట్టుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.