నీరజ్ చోప్రాకు మోడీ అభినందనలు

నీరజ్ చోప్రాకు మోడీ అభినందనలు

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా రజతం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ నీరజ్ చోప్రాకు అభినందనలు తెలియజేశారు. ఇక హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా నీరజ్ చోప్రా సాధించిన ఘనతను కొడియాడారు. నీరజ్ చరిత్ర సృష్టించాడన్న ఆయన.. ఈ ఛాంపియన్ షిప్ లో ఇండియాకు రజతం రావడం ఇదే మొదటిసారని చెప్పారు. నీరజ్ హర్యానాకే గర్వకారణమని కట్టర్ వ్యాఖ్యానించారు.

 

ఇదిలా ఉండగా జావెలిన్ త్రోలో భారత్ కు రజతం సంపాదించిన పెట్టిన నీరజ్ చోప్రా..  మొదటి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి..  తన కెరీర్ లోనే మూడో అత్యుత్తమ త్రోయర్ గా రికార్డు సృష్టించాడు. దీంతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పతకం సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. 2003లో అంజు బాబీ జార్జ్ పతకం సాధిస్తే..... 19 ఏళ్లు తర్వాత ఇప్పుడు నీరజ్ చోప్రా దేశానికి సిల్వర్ అందించడంతో భారత్ అతన్ని ఆకాశానికెత్తుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రాకు అభినందనలు తెలుపుతున్నారు.