వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ

వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ లో హౌరా నుంచి న్యూ జల్పాయ్ గురి వరకు ఈ రైలు ప్రయాణించనుంది. హౌరాలో జరిగిన కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే తల్లి హీరాబెన్ తెల్లవారుజామున చనిపోవడంతో గాంధీనగర్ వెళ్లారు. అక్కడ అంత్యక్రియలు ముగిసిన వెంటనే మోడీ వర్చువల్ మీటింగ్ కు హాజరయ్యారు.

వ్యక్తిగత కారణాలతో పశ్చిమ బెంగాల్ రాలేకపోయాయనని, బెంగాల్ ప్రజలు తనను క్షమించాలని మోడీ కోరారు. దీంతో వీడియో కాన్ఫరెనర్స్ ద్వారా మోడీ జెండా ఊపి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ కొత్త రైలుతో కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. సిటీలో ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపడుతుందన్నారు. దీంతో మెట్రో కనెక్టివిటీ పెరుగుతుందని మోడీ అన్నారు.