LVM3-M6 మిషన్ విజయవంతం కావడం పట్ల ఇస్రోను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ మిషన్ సక్సెస్ తో భారత్ అంతరిక్ష రంగంలో మరో ముందడుగు వేసిందన్నారు. ఈ ప్రయోగం దేశానికి గర్వకారణం అన్నారు. ఇస్రో సక్సెస్ పై X లో ఓ పోస్టు ను షేర్ చేశారు ప్రధాని. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ విజయవంతం కావడంతో అత్యంత బరువైను శాటిలైట్ల ప్రయోగంలో, కమర్షియల్ ఉపగ్రహాల మార్కెట్లో భారత్ బలమైన స్థానాన్ని హైలైట్ చేసిందన్నారు.
భారత అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన తొలి అత్యంత బరువైన ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్2 ను నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చిన LVM-3M6 ప్రయోగం విజయవంతం కావడం అంతరిక్ష పరిశోధన రంగంలో గర్వించదగ్గ మైలురాయి అని ప్రధాని మోదీ ట్వీట్ లో రాశారు.
