మోర్బీ ఘటన పై మోడీ హైలెవల్ మీటింగ్

మోర్బీ ఘటన పై  మోడీ హైలెవల్ మీటింగ్

ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ...  మోర్బీ ఘటన పై ఆ రాష్ట్ర మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గాంధీనగర్ లోని రాజ్భవన్లో జరిగిన ఈ సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను అధికారులు మోడీకి వివరించారు.  బాధితులను అన్నిరకాలుగా ఆదుకోవాలని మోడీ వారికి సూచించారు.  

రేపు  ఘటనాస్థలానికి ప్రధాని మోడీ

కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ రేపు ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.